గాలి కూతురి పెళ్ళి.. బ్రహ్మీకి రూ.10లక్షలు.. జబర్దస్త్ టీమ్ అలెర్ట్.. మేమూ అర్హులమేనంటూ?
అక్రమంగా మైనింగ్ ద్వారా వ్యాపారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్ళి గురించే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వివాహానికి హాజరయ్యే ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చేందుకు రంగం సిద
అక్రమంగా మైనింగ్ ద్వారా వ్యాపారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్ళి గురించే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వివాహానికి హాజరయ్యే ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఒక్కో ఆర్టిస్టు రేంజిని బట్టి క్యాష్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. అందరికంటే ఎక్కువగా బ్రహ్మానందానికి రూ.15 లక్షలు ఇవ్వడానికి గాలి శిబిరం రెడీ అయినట్టు తెలుస్తోంది.
బ్రహ్మీ తర్వాత ఆయా ఆర్టిస్టుల స్థాయిని బట్టి రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఇవ్వొచ్చునని తెలిసింది. గాలి స్నేహితుడు, సినీ నటుడు సాయికుమార్ తమ్ముడు అయ్యప్ప ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయట.
ఈ పెళ్ళికి టాలీవుడ్ ఆర్టిస్టులకు డబ్బులు చెల్లించడానికి గాలి క్యాంప్ సిద్ధంగా ఉందని వార్తలు వస్తుండగా.. ''జబర్దస్త్'' టీమ్ అలర్ట్ అయింది. తాము టీవీ ఆర్టిస్టులమని, సినీ ఆర్టిస్టులతోబాటు తాము కూడా పాపులర్ అయ్యామని, అందువల్ల ఇలాంటి నజరానాలకు తామూ అర్హులమేనని ''జబర్దస్త్'' నటీనటులు అంటున్నారని తెలుస్తోంది. కళాకారులను సమాన స్థాయిలో ఆదరించాలని వీళ్ళు కోరుతున్నారని చెబుతున్నారు.
కాగా గాలి జనార్ధన్ రెడ్డి కూతురి వివాహం రూ.500 కోట్ల మొత్తంతో అట్టహాసంగా జరుగుతోంది. లార్జ్ డిస్ప్లే స్క్రీన్లు, ఫ్రీ వై-ఫై హాట్ స్పాట్‌లు, కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు అమర్చనున్నట్లు తెలిసింది.