Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యాంగ ధర్మాసనానికి ట్రిపుల్ తలాక్‌ పిటిషన్లు: మార్చి 30న విచారణ

ఇస్లాం సంప్రదాయాల కిందకు వచ్చే ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. ఇందుకోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయన

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (09:49 IST)
ఇస్లాం సంప్రదాయాల కిందకు వచ్చే ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. ఇందుకోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో తీర్పు కోరుతూ నాలుగు అంశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. వాటిలో ఈ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 (1), ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21లకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించింది. వీటిపై స్పందించిన కోర్టు రాజ్యాంగ అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది. 
 
దీనిపై చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ ఎన్ వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలు చాలా ముఖ్యమైనవని.. ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని.. అందుచేత విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులను మార్చి 30న రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments