Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి ఉచితంగా ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (14:36 IST)
దేశంలో ఈ నెల 21వ తేదీ సోమవారం నుంచి ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా వేయనున్నారు. ఈ మేరకు కేంద్రం కొత్త విధానాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నెల 8న ప్ర‌ధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేశారు. 
 
ఈ విధానంలో భాగంగా, దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్లు వేయ‌నుంది. 75 శాతం వ్యాక్సిన్ల‌ను త‌యారీదారుల నుంచి కొనుగోలుచేసి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్రధాని వెల్ల‌డించారు. ఇక నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వ‌మూ వ్యాక్సిన్ల కోసం ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌సంర లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం 45 ఏళ్లు పైబ‌డిన వారికి మాత్రమే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేది.
 
18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వారు వ్యాక్సిన్‌కు డ‌బ్బు చెల్లించాల్సిందేన‌ని చెప్ప‌గా.. తెలంగాణ స‌హా కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆ ఖ‌ర్చు తాము భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఈ వ్యాక్సిన్ విధానంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో మోడీ స‌ర్కార్ దిగి వ‌చ్చి అంద‌రికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్ర‌క‌ట‌న చేసింది. 
 
తాజా వ్యాక్సిన్ విధానం ప్ర‌కారం 75 శాతం వ్యాక్సిన్ల‌ను కేంద్ర‌మే కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌నుండ‌గా.. మిగిలిన 25 శాతం వ్యాక్సిన్లు మాత్రం ప్రైవేటు వారికి అమ్ముకునే అవ‌కాశం త‌యారీదారుల‌కు క‌ల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments