Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు జైలు కూడు తినండి. ఒక వేళ తినలేకపోతే..?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (19:01 IST)
మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన తనకు కొన్ని సదుపాయాలు కల్పించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా తనకు ఇంటి భోజనం కావాలని న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. 
 
అయితే కోర్టు మాత్రం మాజీ మంత్రికి షాక్ ఇచ్చింది. 'ముందు జైలు కూడు తినండి. ఒక వేళ తినలేకపోతే అప్పుడు చూద్దాం' అంటూ జడ్జి పేర్కొన్నారు . అయితే తన వయసు 71 ఏళ్లు కావడంతో జైలులో తనకు ప్రత్యేకమైన బెడ్ కావాలని కోరడంతో కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.
 
ఈ నెల 1న మనీ ల్యాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబై కార్యాలయంలో 12 గంటలపైనే ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments