Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు.. ఎక్కడ?

టీ తాగడమే ఆలస్యం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సోమవారం పూట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమృత్‌పూర్ గ్రామానిక

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (12:51 IST)
టీ తాగడమే ఆలస్యం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సోమవారం పూట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమృత్‌పూర్ గ్రామానికి చెందిన రాణి(22) తన ముగ్గురు పిల్లలు మున్సి(8), ఉపాసన(3), కనహియా(7)తో కలిసి ఉంటోంది. భర్త రాంచంద్ర చౌహాన్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో రాణి సోమవారం తన కోసం టీ పెట్టుకుంది. తాగే ముందు పిల్లలకూ ఇచ్చింది. ఆపై రాణి కూడా తాగింది. అయితే తాగిన కొద్దిసేపటికే ఒక్కసారిగా అందరూ కుప్పకూలిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారు తాగిన టీ విషపూరితం కావడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు అంటున్నారు. అయితే టీ ఎలా విషపూరితం అయ్యిందనే దానిపై విచారణ జరుపుతున్నారు. నివేదిక పూర్తయ్యాక వివరాలను వెల్లడిస్తామని చెప్తున్నారు. 
 
మరోవైపు రాణి కుటుంబ సభ్యులు ఆమె అత్తింటివారిపై కేసు పెట్టారు. రాణిని ఆమె పిల్లల్ని అత్తారింటివారే చంపేసి వుంటారని అనుమానం వ్యక్తం చేశారు. వారి శారీరక, మానసిక వేధింపులు భరించలేకే తమ కుమార్తె, పిల్లలు సహా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఫిర్యాదులో వెల్లడించారు. ఇక రాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రాణి అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments