Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో ఇక మాటల్లేవ్... చేతల్లో చూపిస్తాం : ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్

పాకిస్థాన్‌తో ఇకపై మాటలుండవని అన్నీ చేతల్లోనే చూపిస్తామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ సహా ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (16:33 IST)
పాకిస్థాన్‌తో ఇకపై మాటలుండవని అన్నీ చేతల్లోనే చూపిస్తామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ అరూప్ సహా ప్రకటించారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.... పఠాన్‌కోట్, యురీ దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తిప్పికొడతామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత వాయిసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. 
 
దేశ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను తిప్పికొట్టేందుకు కొత్తగా పలు భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. నేరుగా పాక్‌ను ప్రస్తావించకుండా, ప్రతి దాడి తమను మరింత అప్రమత్తం చేస్తోందన్నారు. ఎవరి నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా సుశిక్షితులైన భారత బలగాలు ధీటైన గుణపాఠం చెప్పితీరుతాయన్నారు. సెక్యూరిటీ ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్నెస్, వాయిసేన పోరాట సామర్థ్యం పెంచడం వంటి ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు.
 
ఇకపోతే.. భారత్ సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ, దీనిపై చాలాచర్చే జరిగిందని, అయినా సైన్యం మాత్రం దాని గురించి మాట్లాడదని చెప్పారు. 'లక్షిత దాడులపై దేశంలో చాలా చర్చ జరిగింది. సమాజంలోని అన్ని వర్గాల వారు దానిపై మాట్లాడారు. జాతి అంచనాలకు అనుగుణంగానే సైన్యం వ్యవహరించింది. దాని గురించి మేము మాటల్లో చెప్పం. చేతల్లోనే మా సత్తా ఏమిటో చూపుతాం' అని అరూప్ రహా స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments