Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలు.. ఓ గ్రూపు నడిరోడ్డుపై ఓ అమ్మాయిని?

కొత్త సంవత్సర వేడుకలు ఐటీ రాజధాని నగరం బెంగళూరులో అట్టహాసంగా జరుగుతాయి. టెక్కీలతో పాటు ప్రజలంతా పండగ చేసుకుంటారు. కానీ అర్థరాత్రి పూట జరిగే కొత్త సంవత్సర ఆహ్వాన వేడుకలు మాత్రం నేరాల సంఖ్యను పెంచేస్తున

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (15:13 IST)
కొత్త సంవత్సర వేడుకలు ఐటీ రాజధాని నగరం బెంగళూరులో అట్టహాసంగా జరుగుతాయి. టెక్కీలతో పాటు ప్రజలంతా పండగ చేసుకుంటారు. కానీ అర్థరాత్రి పూట జరిగే కొత్త సంవత్సర ఆహ్వాన వేడుకలు మాత్రం నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. గత ఏడాది బెంగళూరులో ఓ యువతిని నలుగురైదుగురు యువకులు నడిరోడ్డుపై లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం అప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
ఇదే తరహాలో 2018 కొత్త సంవత్సర వేడుకల నాడు రోడ్లపై బెంగుళూరు యువకులు ఓవరాక్షన్ చేశారు. వీధుల్లో వికృతంగా నృత్యాలు చేయ‌డ‌మే కాకుండా అడ్డం వ‌చ్చిన వారిని చిత‌క‌బాది పంపారు. రోడ్ల‌పై అమ్మాయిల‌ను వేధిస్తూ... హింసిస్తూ చాలా సార్లు పోలీసుల‌కు కూడా చిక్కారు. 
 
ఈ క్రమంలో డిసెంబర్ 31 రాత్రి రోడ్ల‌పై అక్క‌డి యువ‌కులు చేసిన పోకిరీ చేష్ట‌లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా మంగళవారం ప‌లువురు యువకులపై కేసులు న‌మోదు చేసిన‌ పోలీసులు ఆ వీడియోను మీడియాకు ఇచ్చారు. 
 
ఈ వీడియోలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ గ్రూపు నడి రోడ్డుపై ఎంజాయ్ చేస్తోంది. ఆ దారిలో ఓ బైకుపై ఇద్ద‌రు యువ‌కులు, ఓ అమ్మాయి వెళుతుండ‌గా వారిని ప‌ట్టుకుని చిత‌క్కొట్టారు. ఈ వీడియోలో ఓవరాక్షన్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం