రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో విమానంలో ఉండే సౌకర్యాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. అంతేనా ఈ తరహా సౌకర్యాలను తొలిసారి శతాబ్ది ఎక
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో విమానంలో ఉండే సౌకర్యాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. అంతేనా ఈ తరహా సౌకర్యాలను తొలిసారి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రవేశపెట్టారు. ఈ రైలు చెన్నై సెంట్రల్ - మైసూరు ప్రాంతాల మధ్య నడుస్తోంది.
ఈ రైలులో ప్రతి సీటుకు ఇన్ఫోటెయిన్‌మెంట్ తెరలు, యూజర్ ఫ్రెండ్లీ స్నాక్ టేబుల్, సౌకర్యవంతమైన సీట్, రెక్నినింగ్ సదుపాయాలను కల్పించారు. అలాగే, టాయిలెట్లను హ్యాండ్స్-ఫ్రీ పీపాలోహిత వ్యవస్థతో అమర్చారు. రైలు బోగీ తలుపులకు ఆటోమేటెడ్ సెన్సార్-ఎనేబుల్ చేశారు. ప్రయాణికుల సీట్ల వద్ద కాలింగ్ బెల్‌తో పాటు విలాసవంతమైన సౌకర్యాలు రైలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.
ప్రత్యేకంగా రూ.3 కోట్ల వ్యయంతో కూడిన కోచ్‌ను ప్రయాణికులకు విమాన సదుపాయాలతో పెరంబూర్ సమీకృత కోచ్ ఫ్యాక్టరీ (ఇటెంగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ -ఐసీఎఫ్)లో నిర్మించారు. చెన్నై నుంచి మైసూరు వెళ్లే ఈ రైలుకు శుక్రవారం నుంచి పచ్చజెండా ఊపారు. ఈ సౌకర్యాలతో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు.