Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంట హత్య కేసులో టూటూల ఆధారంగా నిందితుల గుర్తింపు!!

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (14:48 IST)
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇద్దరు యువతుల హత్య కేసులోని నిందితులను పోలీసులు గుర్తించారు. ఓ యువకుడి చేతిపై ఉన్న టాటూ, మరో నిందితుడి చేతిలో ఉన్న పోలీసుల వైర్‌లెస్ సెట్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గత 2009 మార్చి 18న నగరంలో ఐటీ నిపుణురాలు జిగీశ ఘోష్ అనే యువతి హత్య జరిగింది. రెండు మూడు రోజుల తర్వాత ఫరీదాబాద్‌లోని సూరజ్ కుంద్ ప్రాంతంలో ఈమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఆమెను దోచుకొని హత్య చేశారు. జిగీశ డెబిట్ కార్డు ఉపయోగించి నిందితులు షాపింగ్ కూడా చేశారు. 
 
ఈ సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన విచారణ అధికారులు వారిలో ఒకరి చేతికి టాటూ (పచ్చబొట్టు), మరొకరి చేతిలో పోలీసుల వైర్లెస్ సెట్టు, తలపై టోపీ ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ సాయంతో మరింత నిశిత పరిశీలన చేశారు. ఆ తర్వాత నిందితులు బల్జీతామాలిక్, రవికపూర్, అమిత శుక్లాలను అరెస్టు చేశారు. వీరిలో మాలిక్ చేతిపై అతడి పేరుతో టాటూ ఉండగా, రవికపూర్ వద్ద గతంలో పోలీసు అధికారి నుంచి లాక్కొన్న వైర్‌లెస్ సెట్టు ఉంది. 
 
వసంత్ విహార్‌లోని జిగీశ ఇంటి సమీపం నుంచి ఆమెను అపహరించి, ఆమె వద్ద ఉన్న వస్తువులు దోచుకున్నాక చంపి పడేసినట్లు నిందితులు ముగ్గురూ అంగీకరించారు. ఈ సందర్భంగా రవికపూర్ చెప్పిన మరో విషయం విని పోలీసులు విస్తుపోయారు. నెల్సన్ మండేలా మార్గ్‌లో మరో యువతిని తాము హత్య చేశామని, ఇందులో అజయ్ కుమార్, అజయ్ సేథి అనే మరో ఇద్దరి హస్తం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో 2008 సెప్టెంబరు 30న జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ హత్యకేసు గుట్టు కూడా రట్టయింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments