Fish - Snake Fight :: పాముకు చుక్కలు చూపిన చేప (Video)
సాధారణంగా చేప పిల్లలను పాములు తినడం చూశాం. కానీ, పాముకు ఓ చేప చుక్కలు చూపిన ఘటనలు ఎక్కడైనా విన్నారా? చూశారా? లేదు కదా. అయితే, ఈ వీడియో చూడండి. ఓ పాముతో ఓ చేప ఏ విధంగా ఫైటింగ్ చేసిందో.
సాధారణంగా చేప పిల్లలను పాములు తినడం చూశాం. కానీ, పాముకు ఓ చేప చుక్కలు చూపిన ఘటనలు ఎక్కడైనా విన్నారా? చూశారా? లేదు కదా. అయితే, ఈ వీడియో చూడండి. ఓ పాముతో ఓ చేప ఏ విధంగా ఫైటింగ్ చేసిందో.
బురద మడుగులో ఉన్న చేపను మింగేందుకు పాము ప్రయత్నించింది. కానీ చేప మాత్రం తనను తనను తాను కాపాడుకోవడమే కాకుండా, తనను మింగకుండా పాముతో ఫైట్ చేసింది. తనను మింగబోతున్న పామును చేప ముందుగానే గ్రహించి.. పాము నోటిని పట్టేసింది. దీంతో రెండింటి మధ్య కాసేపు ఫైటింగ్ జరిగింది.
చేప నుంచి పాము తప్పించుకోలేక పోయింది. చివరకు ఏ ఒక్కటి కూడా విజేత కాలేకపోయాయి. చేప, పాము రెండు చనిపోయాయి. ఈ సంఘటన ఈశాన్య రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పాము, చేప ఫైటింగ్‌ను వీడియో తీసిన కొందరు వ్యక్తులు.. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి.