Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా తర్వాత భారత్ దూసుకెళ్తోంది.. విత్తమంత్రి నిర్మలమ్మ

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (18:10 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్ దెబ్బకు వణికిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అయితే, ఈ కరోనా ఎఫెక్టు భారత్‌పై ఏమాత్రం లేదని నమ్మబలుకుతూ వచ్చిన భారత రిజర్వు బ్యాంకు ఆర్థికవేత్తలు ఇపుడు ఉన్నఫళంగా ఓ బాంబు పేల్చారు. భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 
 
దేశంలో కొవిడ్ ప్రభంజనం తర్వాత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని చెప్పుకొచ్చారు. మహమ్మారి వ్యాప్తి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, అనేక రంగాలు క్రమంగా కుదుటపడుతున్నాయని వివరించారు. గత నెలలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని తెలిపారు. 
 
గతేడాది అక్టోబరు నాటి జీఎస్టీ వసూళ్లతో పోల్చితే ఇది 10 శాతం అధికం అని వెల్లడించారు. ఈ అక్టోబరులో రూ.1.05 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు వచ్చాయని గుర్తుచేశారు. ముఖ్యంగా, భారత స్టాక్ మార్కెట్లు దౌడు తీస్తున్నాయని, బ్యాంకు రుణాల శాతం పెరిగిందని, ఎఫ్ డీఐల శాతం కూడా 13 శాతం పెరుగుదల నమోదు చేసిందని వివరించారు.
 
అదేసమయంలో నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ పథకం ప్రకటించారు. నెలకు రూ.15 వేల కంటే తక్కువ జీతంతో ఈపీఎఫ్ఓ నమోదిత సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కొవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిని ప్రోత్సహించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ ఉపయోగపడుతుందని చెప్పారు.
 
ఈ పథకం దేశంలో ఉద్యోగ క‌ల్ప‌న‌కు ఊతం ఇవ్వ‌నున్న‌ది. కొత్త ఉద్యోగాల‌ను క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో.. ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ రోజ్‌గార్ యోజ‌న స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈపీఎఫ్‌వోలో రిజిస్ట‌ర్ చేసుకున్న సంస్థ‌ల‌కు కొన్ని ఆఫర్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 
 
ఈపీఎఫ్‌వో లేని ఉద్యోగుల‌కు ఈపీఎఫ్‌వో క‌ల్పిస్తే, లేదా మార్చి ఒక‌టి నుంచి సెప్టెంబ‌ర్ 30 మ‌ధ్య కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన‌వారికి ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ రోజ్‌గార్ యోజ‌న కింద ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. ఈ ఏడాది అక్టోబ‌ర్ ఒకటో తేదీ నుంచి వ‌చ్చే ఏడాది జూన్ 30 వ‌ర‌కు స్కీమ్ అందుబాటులో ఉంటుంది. 
 
50 మంది క‌న్నా త‌క్కువ ఉద్యోగులు ఉన్న సంస్థ‌లు.. కొత్త‌గా క‌నీసం ఇద్ద‌రు ఉద్యోగుల్ని రిక్రూట్ చేయాల‌ని, 50 క‌న్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థ‌లు క‌నీసం అయిదుగుర్ని చేర్చుకోనే విధంగా స్కీమ్‌ను రూపొందించారు. సెప్టెంబ‌ర్ నెల‌ను ఈ స్కీమ్‌కు బేస్‌గా భావిస్తున్నారు. 
 
వెయ్యి మంది ఉద్యోగులు ఉన్న సంస్థ‌లో రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి.. ఈపీఎఫ్‌వో రిజిస్ట‌ర్ అయి ఉంటే, 12 శాతం ఉద్యోగి, 12 శాతం సంస్థ కాంట్రిబ్యూష‌న్‌ను.. మొత్తం క‌లిసి 24 శాతం వాటాను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని మంత్రి తెలిపారు. 
 
వెయ్యికిపైగా ఉద్యోగులు ఉన్న సంస్థ‌లో.. రెండేళ్ల పాటు ఉద్యోగి వాటాను కేంద్ర ప్ర‌భుత్వ‌మే చెల్లించ‌నున్న‌ది. ఆధార్ కార్డుతో అనుసంధాన‌మై ఉన్న ఈపీఎఫ్‌వో అకౌంట్‌లో ఆ మొత్తం జ‌మ చేయ‌బడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments