Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:31 IST)
పురుషులు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ప్రతి ఒక్కరి జీవన విధానంలో వచ్చినమార్పులేనని చెబుతున్నారు. కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలతో అనారోగ్య సమస్యలకు దారితీయడం ఒక కారణమైతే.. మరొక కారణం.. ప్లాస్టిక్‌ వినియోగం.

ఈరోజుల్లో ప్లాస్టిక్‌ వినియోగం సర్వసాధారణం. అయితే ఈ ప్లాస్టిక్‌, కాస్మొటిక్స్‌, ఫుడ్‌ ప్యాకేజింగ్‌ వంటి ఉత్పత్తుల్లో లభించే థాలెట్స్‌ అనే సాధారణ కెమికల్స్‌.. ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం వేగంగా తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రీప్రొడెక్టివ్‌ ఎపిడెమియాలజిస్ట్‌ సినాయి స్వాన్‌ ప్రకారం... ఈ కెమికల్స్‌ ఉన్న ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల మానవాళి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందని, సంతానపరంగా తీవ్రమైన సమస్యలు ఎదుక్కోబోతున్నారంటూ హెచ్చరిస్తున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా మానవుల్లోని స్పెర్మ్‌ కౌంట్‌ వేగంగా పడిపోయిందని అధ్యయన పరిశోధక బందం కనుగొంది. థాలెట్స్‌ అనే రసాయనాలు పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో ఆ పరిశోధక బందంలో స్వాన్‌ అనే శాస్త్రవేత్త వివరించారు.

పిల్లల జీవసంబంధ అభివద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయనేది మరింత అధ్యయనం చేయాల్సిందిగా చెబుతున్నారు. చిన్నపిల్లల మధ్య జీవసంబంధమైన తేడాలను కూడా ప్రభావితం చేస్తుందని గుర్తించారు.

శారీరకంగానే కాదు.. మేధో వికాసం పరంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. ఆడవారిలో కంటే మగవారిలోనే సంతానోత్పత్తి పరంగా సామర్థ్యాన్ని వేగంగా కోల్పోతున్నారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments