Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వద్ద పిచ్చి వేషాలు వేయొద్దు : దినకరన్‌కు సుప్రీం వార్నింగ్

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమ వద్ద పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దంటూ హెచ్చరించింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) ఉల్లంఘన కేసులో ద

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (06:17 IST)
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమ వద్ద పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దంటూ హెచ్చరించింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) ఉల్లంఘన కేసులో దినకరన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పైగా, కేసు దర్యాప్తు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణ ఎదుర్కోవాలని దినకరన్‌కు సూచించింది. 
 
ఈ కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టు పిటీషన్ దాఖలు చేయగా అక్కడ చుక్కెరుదైంది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ దినకరన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ విచారణ ఆలస్యం చేసేందుకు మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 
 
దినకరన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫెరా ఉల్లంఘన కింద రెండు కేసులు నమోదు చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి లేకుండా అమెరికా డాలర్లను బ్రిటన్‌లోని ఓ కంపెనీకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. దీంతో పాటు 44.37లక్షల పౌండ్లు విదేశాల్లో లావాదేవీలు నిర్వహించినట్లు మరో కేసు కూడా ఈడీ నమోదు చేసింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments