Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే భర్తలకు తిండిపెట్టండి.. లేకుంటే అది కట్?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (15:27 IST)
భారత్‌తో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నిక‌ల కోసం విచిత్ర రీతిలో ప్ర‌చారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన అనూహ్యమైన కామెంట్ చేశారు. మీ భర్తలు మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే, వారికి ప్రేమతో అన్నం పెట్టాలని, లేకుంటే ఆ రోజు వాళ్లకు అన్నం పెట్టవద్దంటూ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆడవాళ్లను ఉద్దేశించి అన్నారు. 
 
బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మ‌ధుబ‌నిలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో నితీశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉదయం పూటనే ఓటు వేయాలని ఆయన మహిళలను అభ్యర్థించారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు నితీశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. 
 
ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చారు. మద్యాన్ని నిషేధించారు. కన్యా వికాస్, ముఖ్యమంత్రి నాప్‌కిన్ యోజన లాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో తనకు మహిళల అండ ఉంటుందని నితీశ్ ధీమాగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం