చిన్నాన్న అంటే తండ్రితో సమానం. అయితే అలాంటి వ్యక్తి యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. యువతి తండ్రికి విషయం తెలిసి మందలించాడు. అలా చేయకూడదని హెచ్చరించాడు. అయినా మార్పు రాలేదు. ఏకంగా కూతురు పడక గది దృశ్యాలు చూసి షాకైన తండ్రి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా కల్లకూరిచి చిన్నసలేం సమీపంలోని నారియప్పనూర్ ప్రాంతంలో మురుగేశన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతని కూతురు శరణ్య, నర్సింగ్ కోర్సు చేసి కల్లకూరిచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
ఆ ప్రాంతంలోనే ఉంటున్న చిన్నాన్న వరుసయ్యే మణికంఠన్‌తో పరిచయం పెంచుకుంది. ప్రతిరోజు మణికంఠన్ శరణ్యను ఆసుపత్రిలో వదిలేవాడు. చిన్నాన్న వరుస కావడంతో శరణ్య తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అయితే ఇదే అదునుగా మణికంఠన్ శరణ్యకు మాయమాటలు చెప్పాడు. లోబచరుకున్నాడు.
శరణ్య తనకు ఎక్కడ దూరమవుతోందేమోనన్న భయంతో రాసలీలల వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోలను తన సెల్‌ఫోన్ లోనే దాచుకున్నాడు. అయితే ఆ వీడియోలను మణికంఠన్ స్నేహితులు ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేశారు.
ఇది కాస్త ఆ ప్రాంతానికి చెందిన వారు చూసి శరణ్య తండ్రికి చెప్పాడు. మొదట్లో నమ్మని మురుగేశన్ ఆ తరువాత ఆ వీడియోలను చూసి మనస్థాపానికి గురయ్యాడు. గ్రామంలో పరువు పోతుందన్న బాధతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.