గర్భంతో వున్న కూతురు.. పొట్టపై కత్తితో పొడిచి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 18 జులై 2019 (11:36 IST)
మహారాష్ట్రలో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకుని గర్భంతో వున్న సమయంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఓ యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆమె పట్ల తండ్రే యముడై కూర్చున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, గట్కోబర్ ప్రాంతంలో నివసిస్తున్న రాజ్ కుమార్ కుమార్తె మీనాక్షి (20). ఈమె అదే ప్రాంతానికి చెందిన బ్రిజేష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. 
 
ఈ విషయం తండ్రికి తెలియడంతో.. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుందని.. పరువు పోతుందని భావించాడు. వీరి వివాహానికి అడ్డుచెప్పాడు. కానీ ప్రేమించి వివాహం చేసుకున్న మీనాక్షి గర్భంతో వున్నానని చెప్పేందుకు స్వగ్రామానికి వచ్చింది. 
 
అలా వచ్చిన కూతురిని ఇంటికి తీసుకుపోని ఆమె తండ్రి రాజ్ కుమార్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కూతురు కడుపుతో వుందనే కనికరం లేకుండా కత్తితో పొట్టపై పొడిచి ఘోరంగా హత్య చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మీనాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు పంపారు. రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments