Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తె.. కిరోసిన్ పోసి నిప్పంటించిన..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (13:00 IST)
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తెకు ఓ తండ్రి కఠినంగా శిక్షించాడు. ఏకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై, విరార్ ప్రాంతంలో కూలీపనిచేసే మొహ్మద్ మన్సూర్ అనే వ్యక్తి.. తన భార్య, కుమార్తెతో నివాసముంటున్నాడు. మన్సూర్ కుమార్తె సాయేషా (16) గంటల పాటు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. 
 
ఎంత చెప్పినా సాయేషా ఫోనులో మాట్లాడటాన్ని తగ్గించలేదు. దీంతో ఆవేశానికి గురైన మన్సూర్.. సెల్‌ఫోన్‌ను లాక్కుని.. దాంతోనే సాయేషా తలపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా చేతికి దొరికిన కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించేశాడు. 
 
ఈ ఘటనను కళ్లారా చూసిన సాయేషా తల్లి.. లబోదిబోమంటూ.. స్థానికుల సాయంతో సాయేషాను ఆస్పత్రికి తరలించింది. తీవ్రగాయాలతో సాయేషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుమార్తెపై హత్యాయత్నానికి ప్రయత్నించడంతో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments