Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డ నోటిని కట్టేశాడు.. ఒంటరిగా నిద్రించిన కూతురిని కాటేశాడు.. ఎక్కడ?

కన్నబిడ్డను కంట్లో పెట్టి చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. తండ్రులే తన ఆడకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడే ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ర

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (14:47 IST)
కన్నబిడ్డను కంట్లో పెట్టి చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. తండ్రులే తన ఆడకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడే ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరుకు చెందిన ఓ వ్యక్తి పదిహేనేళ్ల క్రితం కాకినాడకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
 
కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. చెడు అలవాట్లకు బానిస అయిన భర్తను వదిలేసిన భార్య మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళిపోయింది. పిల్లలను తల్లి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది. అప్పటినుంచి అమ్మమ్మ ఇంట్లోనే చదువుకుంటున్న పిల్లలు.. ఇటీవల కొంతమూరులోని తండ్రి వద్దకు వెళ్లారు. నానమ్మ తాతయ్యలతో పాటు తండ్రిని చూడటానికి గత నెల 13వ తేదీన అక్కడికి వెళ్లారు. 
 
అయితే కరెంట్ లేకపోవడంతో అంతా బయటే నిద్రించారు. చిన్నారి మాత్రం ఒంటరిగా ఇంట్లో పడుకుంది. ఆ రాత్రి 12 గంటల సమయంలో ఒంటరిగా నిద్రిస్తున్న కుమార్తెపై కామంతో కళ్లుమూసుకుపోయి తండ్రే అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అరుపులు వినిపించకుండా నోటిని కట్టేసి ఈ పాడు పని చేశాడు. ఈ విషయాన్ని బాలిక అమ్మమ్మకు చెప్పింది. దీంతో బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టిన తండ్రి తనపై కేసు నమోదైందని తెలియగానే కిరోసిన్ తాగాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments