Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి కాదు.. కిరాతుకుడు : భార్యపై అనుమానంతో కుమార్తెపై అత్యాచారం

అతను తండ్రికాదు.. కిరాతకుడు. కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానంతో కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హతమార్చి ఫ్యాన్‌కు ఉరివేసి, ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (09:51 IST)
అతను తండ్రికాదు.. కిరాతకుడు. కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానంతో కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హతమార్చి ఫ్యాన్‌కు ఉరివేసి, ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి జరిగిన శవపరీక్షలో అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో పైగా, బాలిక శరీరంపై లభ్యమైన అనవాళ్లతో నిందితుడి వీర్యం డీఎన్ఏ సరిపోయింది. దీంతో ఆ కసాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేసి జైలుకుపంపారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ శివార్లలో బేరేలా గ్రామానికి చెందిన బాలిక ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఫోన్ రావడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆరేళ్ల బాలిక ఫ్యాన్‌కి ఎలా ఉరి వేసుకుందో అర్థం కాని పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. దాన్ని బాలిక తండ్రి తీవ్రంగా అడ్డుకున్నాడు. దీంతో అతని వ్యవహారంపై పోలీసులకు అనుమానం వచ్చింది. 
 
దీంతో పోలీసులు పోస్టు మార్టంకి పంపించారు. పోస్టు‌మార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగిందని, బాలిక శరీరంపై లభ్యమైన వీర్యం డీఎన్ఏతో అతని వీర్యనమూనా సరిపోయింది. దీంతో పోలీసులు తమదైనశైలిలో అతనిని విచారించగా, తన భార్య వివాహేతర సంబంధం వల్ల ఆ పాప పుట్టిందని అందుకే, తన భార్యను షాపింగ్‌కు పంపి, బాలికను హతమార్చానని అంగీకరించాడు. దీంతో అతనిని కటకటాల వెనక్కి పంపించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments