Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై అత్యాచారం జరిగిందని నాన్నకు చెప్పా.. కుప్పకూలిపోయాడు.. గుండె ఆగిపోయింది..

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 15 ఏళ్ల బాలికపై ఓ పోలీసు అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నబిడ్డ అత్యాచారానికి గురైందన్న వార్త విని బాధితురాలి తండ్రి గుండె ఆగిపోయింది. ఈ ఘటన ఉత్త

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (11:52 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 15 ఏళ్ల బాలికపై ఓ పోలీసు అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నబిడ్డ అత్యాచారానికి గురైందన్న వార్త విని బాధితురాలి తండ్రి గుండె ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బల్లియా జిల్లాలోని పోలీస్‌ అవుట్‌ పోస్టు సమీపంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  బాలిక రాత్రిపూట టాయిలెట్ కోసం ఇంటి నుంచి బయటకి వెళ్లింది. బాలిక బయటికి రావడాన్ని చూసిన గోపాల్‌పుర్‌ అవుట్‌ పోస్ట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధరమ్ ‌‌(38)  బాలికను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు పెట్టడంతో స్థానికులు ఆమెను కాపాడారు. గ్రామస్థుల్ని చూసిన కానిస్టేబుల్ పారిపోయాడు. 
 
పోలీసులకు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. తనపై అత్యాచారం జరిగిందంటూ నాన్నతో ఏడుస్తూ చెప్పేసరికి.. ఆయన కుప్పకూలిపోయాడని.. అపస్మారక స్థితికి చేరుకున్నాడని చెప్పింది. ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments