Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం మహిళలు కూడా ఓట్లు వేశారు.. ప్రజల హృదయాలు గెలుచుకో!: యూపీ సీఎంకు తండ్రి సలహా

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించిన విషయంతెల్సిందే. మొత్తం 403 సీట్లకు బీజేపీ ఏకంగా 3

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (10:39 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించిన విషయంతెల్సిందే. మొత్తం 403 సీట్లకు బీజేపీ ఏకంగా 325 సీట్లలో విజయఢంకా మోగించింది. దీంతో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టారు. 
 
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తన బిడ్డకు యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఓ సలహా ఇచ్చారు. హిందూ ఓట్లతోనే మీరు (బీజేపీ) గెలవలేదనీ, ముస్లింలతోపాటు ప్రతి ఒక్కరూ ఓట్లు వేశారని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలని... ముస్లిం మహిళలు కూడా నీకు ఓటేశారని... అన్ని మతాలను గౌరవించాలని... అందరి హృదయాలను గెలుచుకోవాలని సలహా ఇచ్చారు. 
 
ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ముస్లిం మహిళలు ఓటు వేయడానికి ప్రధాన కారణం ట్రిపుల్ తలాక్‌తో పాటు.. ఇతర సమస్యల నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందన్న భావన ఉందన్నారు. ఆ ఆశతోనే బీజేపీకి ఓటు వేశారని బిష్త్ తెలిపారు. అన్ని మతాలకు చెందిన ప్రజలను యోగి సమానంగా చూడాలని... రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించాలని ఆకాంక్షించారు. ప్రజల మనసులు గాయపడేలా యోగి వ్యాఖ్యలు చేయరాదని కోరారు. తన కుమారుడు ఎంతో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. హిందూ మత ప్రచారకర్తగా ఉన్న మచ్చను యోగి చెరిపేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments