Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా అధ్యక్షుడి పేరు.. డీడీ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టింది!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (14:15 IST)
చైనా అధ్యక్షుడి పేరు.. డీడీ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టింది.. అంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడి పేరు, దూరదర్శన్ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిందని.. సాక్షాత్తు ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ చెప్పారు.  
 
అసలు విషయమేంటంటే..., చైనా అధ్యక్షుడు ఝీ జిన్ పింగ్‌లో తొలి ‘ఝీ’ని ఆంగ్లంలో ‘‘ఎక్స్, ఐ’’ అనే రెండు అక్షరాల సమాహారంగా రాస్తామని మనకు తెలిసిందే. ఇక, రోమన్ అంకెల్లోని '11' కూడా ఈ రెండు అక్షరాల మాదిరిగానే ఉంటుంది. 
 
మరి, దూరదర్శన్ న్యూస్ యాంకర్‌కు, ఈ రెండింటిపై అవగాహన ఉందో, లేక రోమన్ అంకె మాత్రమే గుర్తుందో తెలియదు కాని, చైనా అధ్యక్షుడి పేరును ‘‘ఎలెవెన్ జిన్ పింగ్’’గా ఉచ్చరించేశారు. వార్తలు ముగిసేలోగా సదరు యాంకర్ చేతిలో ఉద్వాసన ఉత్తర్వులు ప్రత్యక్షమయ్యాయి. 
 
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానెల్‌లో పనిచేస్తున్న యాంకర్‌కు ఆమాత్రం తెలియకపోతే ఎలా? అన్న రీతిలో ‘‘ఆ యాంకర్ ను తొలగించేశాం’’అంటూ ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ ఆవేశంగా ప్రకటించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments