Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు అడ్డుగా ఉందనీ ప్రియురాలి అక్కను వేధించిన ప్రియుడు...

తన ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియురాలి అక్కను ఫేస్‌బుక్ ద్వారా బెదిరించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికురాలి అక్క పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరచి అందులో అశ్లీల వీడియోలను అప్‌ల

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (10:17 IST)
తన ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియురాలి అక్కను ఫేస్‌బుక్ ద్వారా బెదిరించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికురాలి అక్క పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరచి అందులో అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఆమెను వేధించాడు. ఈ ఘటన మైసూర్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... నగరంలోని జయలక్ష్మిపురలో ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న ఓ మహిళ తన ఇద్దరు చెల్లెళ్లతో కలసి జయలక్ష్మిపురలో నివాసముంటోంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడికి ఆమె చెల్లెలితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. వారిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె తన చెల్లెల్ని ప్రేమించడం మానుకోవాలని యువకుడిని హెచ్చరించడంతో పాటు తన చెల్లెలిని కూడా మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 
 
ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరచి అందులో ఆమె పనిచేస్తున్న కాలేజీలోని విద్యార్థులకు, ఆమె బంధువులకు, స్నేహితులకు అశ్లీల వీడియోలను పంపించాడు. అదేవిధంగా కొంతమంది బయటి వ్యక్తులను స్నేహితులుగా చేర్చుకొని వారితో అశ్లీలకరంగా చాటింగ్‌లు చేయడంతో పాటు ఆమె ఫోన్ నెంబర్‌ను అందరికి షేర్ చేయడంతో చాలా ఇబ్బందులు పడ్డానని బాధిత మహిళ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అయితే నిందితుడి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments