Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని స్వలింగ సంపర్కానికి ఉసికొల్పిన ముఠా అరెస్ట్

ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని.. ఆపై మోసానికి పాల్పడే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వలింగ సంపర్కానికి ఉసికొల్పి యువకులను తమ ప్రాంతానికి రప్పించుకుని.. ఆ తర్వాత వారి వద్ద ఉన్న డబ్బు, సెల్‌ఫోన్లు దోచు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (09:00 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని.. ఆపై మోసానికి పాల్పడే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వలింగ సంపర్కానికి ఉసికొల్పి యువకులను తమ ప్రాంతానికి రప్పించుకుని.. ఆ తర్వాత వారి వద్ద ఉన్న డబ్బు, సెల్‌ఫోన్లు దోచుకుని దాడిచేసి తరిమేస్తున్న ముఠాను కోవై పోలీసులు తెలిపారు.

వారి వద్ద నుంచి రూ.లక్ష నగదు, ఒక బైకు, ఎనిమిది సెల్‌ఫోన్లు, పోలీసు డ్రస్‌, పోలీసు గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లాకు చెందిన మారిశ్వర కన్నన్‌ (30), తిరుపూర్‌లో ఒక ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్‌లో కోవై గణపతి ప్రాంతానికి చెందిన తరుణ్‌ కార్తిక్‌ పరిచయమయ్యాడు.
 
మారిశ్వర కన్నన్‌కు మాయమాటలు చెప్పి అతనిని స్వలింగ సంపరక్కానికి ఉసికొల్పి కోవై రావాల్సిందిగా కార్తిక్‌ ఆహ్వానించాడు. దీంతో కన్నన్‌ డిసెంబర్‌ ఒకటో తేదీన మేట్టుపాళయంకు వచ్చాడు. అతన్ని తరుణ్‌ కార్తిక్‌ అక్కడి దాసంపాళయం అనే గ్రామంలో మారుమూల ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరి కొందరు ఉన్నారు. వారిలో పోలీసు దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తాను మేట్టుపాళయం పోలీసు అని తప్పు చేయడానికి ఇక్కడి వచ్చావంటూ బెదిరించి కన్నన్ ‌వద్ద ఉన్న వస్తువుల్ని లాక్కొన్నాడు. ఆపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆరు నెలలుగా పలువురిని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని దాసపాళయంకు రప్పించి దోచుకుంటున్నారన్నారు. వీరిపై ఐదు విభాగాల కింద కేసును నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments