Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్‌లో బయటపడిన దొంగ మొగుడి బండారం!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (18:36 IST)
భర్త బండారం ఫేస్ బుక్ బయటపెట్టింది. మైక్రో ఫ్యామిలీల నేపథ్యంలో ఎక్కువ మంది మాట్రిమోనియల్ వెబ్ సైట్స్‌లో సంబంధాలు వెతుక్కోవాల్సి వస్తోంది. వ్యక్తి పూర్వాపరాలతో సంబంధం లేకుండా, కేవలం ఆ వ్యక్తి చెప్పిన వివరాల ఆధారంగానే ఈ తరహా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తరువాత కొన్ని నిజాలు బయటపడడంతో బాధితులు తలబాదుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.
 
ఘజియాబాద్‌లోని ఓ సంస్థలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఓ మహిళ (టీచర్)కు రిక్వెస్ట్ పంపాడు. రెండు నెలల ఛాటింగ్ తరువాత వారిద్దరూ దంపతులయ్యారు. అనంతరం పుణె వెళ్లిపోయారు. అక్కడి నుంచి 2014లో గుర్‌‌గావ్‌కు మకాం మార్చారు. ఇంతలో ఆమె ఓ రోజు అతని ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. 
 
అందులో అతని స్నేహితుడు చేసిన ఓ పోస్టింగ్‌తో అనుమానం వచ్చిన ఆమె, అతని ప్రొఫైల్, ఫోటోలు పూర్తిగా తనిఖీ చేసింది. దీంతో, అతనికి అప్పటికే పెళ్లైందని, ఓ కుమార్తె కూడా ఉందని బట్టబయలైంది. షాక్ తిన్న ఆమె, తన భర్త తనను వంచించాడంటూ, తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్టు చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments