Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి 11 గంటలకు ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో భార్య.. ఉన్నట్టుండి భర్త ఇంటికొచ్చాడు..

సోషల్ మీడియాతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. వాటి కారణంగా నేరాలు సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియా మోజులోపడి.. చాలామంది మానవీయ విలువలను మరిచిపోతున్నారు. ఫేస్‌బుక్ పరిచయంతో ఎవరితో

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (13:10 IST)
సోషల్ మీడియాతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. వాటి కారణంగా నేరాలు సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియా మోజులోపడి.. చాలామంది మానవీయ విలువలను మరిచిపోతున్నారు. ఫేస్‌బుక్ పరిచయంతో ఎవరితో పడితే వారితో ప్రేమలో పడటం.. వాటికోసం నేరాలకు పాల్పడటం మామూలైపోయింది. తాజాగా ఫేస్‌బుక్ పరిచయం మరోసారి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. 
 
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో భార్య సన్నిహితంగా వుండటం చూసిన భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కీల్‌పాకం పెరుమాళ్ వీధికి చెందిన కిషోర్ కోఠారి ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు. రాజస్థాన్‌కు చెందిన ఇతనికి సీమా అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. 
 
వీరికి పిల్లలు లేరు.. ఈ దంపతులతో పాటు సీమా చెల్లెలు బేబీ నివసిస్తున్నారు. సీమా, బేబీలకు రాజస్థాన్‌కు చెందిన రవిప్రకాశ్ అనే యువకుడితో మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. దీంతో నాటి నుంచి మేసెంజర్‌లో ఛాట్ చేసుకుంటూ వస్తున్నారు.
 
కిశోర్ కోఠారి బయటికి వెళ్లగానే అతని ఇంటికి వచ్చి అక్కచెల్లెళ్లతో మాట్లాడేవాడు. మంగళవారం రవిప్రకాశ్.. కిషోర్ ఇంటికి వచ్చాడు. అయితే కిశోర్ 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఇంటికి రావడంతో.. సీమా కంగారుపడింది.. భార్యతో పరాయి వ్యక్తి సన్నిహితంగా ఉండటం చూసి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
ఆ సమయంలో సీమా వంటింట్లోని కత్తి తీసుకుని కిశోర్‌పై దాడి చేసింది. దీనిపై కీల్‌పాకం పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన కిషోర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సీమా, బేబీ, రవిప్రకాశ్‌లను పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments