Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నరేంద్ర మోడీ...

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (11:48 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడి అయోధ్య నగర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అదీకూడా 29 యేళ్ల తర్వాత. తన మాట నిలబెట్టుకున్న తర్వాతే ఆయన అయోధ్య పట్టణంలో అడుగుపెడుతున్నారు. 29 ఏళ్ళ క్రితం శపథం చేసిన శపథాన్ని ఆయన ఇపుడు నెరవేర్చుకున్నారు. 
 
బుధవారం అయోధ్యలో జరిగే రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అథితిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని ఫొటోగ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. 
 
29 యేళ్ల క్రితం అంటే 1991లో రామ్‌లల్లా జన్మోత్సవ కార్యక్రమం సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషితో కలిసి మోడీ అయోధ్యలో పర్యటించారని ఆయన గుర్తుచేశారు. తాను ఆ సమయంలో వీహెచ్‌పీ కోసం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుండేవాడినని, అక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా తనతో ఉన్నారన్నారు.
 
మోడీని బీజేపీ గుజరాత్‌ నాయకుడిగా విలేకరులకు మురళీ మనోహర్ జోషి పరిచయం చేశారని చెప్పారు. తనతో పాటు మరికొంత మంది జర్నలిస్టులు మోడీని అయోధ్యకు తిరిగి ఎప్పుడు వస్తారని అడిగారని చెప్పాడు. 
 
దీనిపై మోడీ స్పందిస్తూ, రామ్ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడే తిరిగి తాను అయోధ్యకు వస్తానని చెప్పారని వివరించారు. అప్పట్లో మోడీ తాను ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారని ఆయన అన్నాడు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments