భార్యా పిల్లలను చంపిన మాజీ టెక్కీ... వాట్సాప్‌లో వీడియో పోస్ట్

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (15:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మాజీ టెక్కీ తన భార్యతో పాటు.. ముగ్గురు పిల్లలను హత్య చేసి,  ఆ వీడియోను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన సుమిత్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అన్షూబాల అనే మహిళతో కొన్నేళ్ళ క్రితం వివాహం కాగా, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్షూబాల మాత్రం సైకాలజీ టీచర్‌గా పని చేస్తుంది. కుమార్‌ కొద్ది నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు.
 
దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యతో గొడవపడిన కుమార్‌.. అదే రోజు రాత్రి భార్య, ముగ్గురు పిల్లలను కిరాతంగా హత్య చేశాడు. నిద్రలో ఉన్న భార్య, పిల్లల్ని హత్య చేసి, వీడియో తీసి ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు.
 
ఈ వీడియోను చూసిన చేశారు. అన్షూ అన్నయ్య పంకజ్‌ సింగ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లాడు. తలుపులు తెరచి చూడగా అన్షూ, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడిఉన్నారు. పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఉద్యోగం పోవడంతోపాటు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న కుమార్.. మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో భార్యతో గొడవపడి హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పంకజ్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమర్‌ని అరెస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments