Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. ఇంద్రాణీ ఆ పని చేసింది: షీనాకు లిప్ స్టిక్ రాసి-జుట్టు సరిచేసి-పెట్రోల్ పోసి తగలెట్టేసింది!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి కారు డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ నాలుగో నిందితుడు. షీనాను హత్యచేయడానికి సహకరించాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అతడు అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే

Webdunia
శనివారం, 29 జులై 2017 (11:41 IST)
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి కారు డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ నాలుగో నిందితుడు. షీనాను హత్యచేయడానికి సహకరించాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అతడు అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. 
 
2012 ఏప్రిల్‌లో ముంబై శివారు ప్రాంతంలో ఇంద్రాణి తన మాజీ భర్తతో కలిసి కారులో తన కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేశారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో ముంబయి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సగం కాలిపోయిన స్థితిలో షీనా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ హ‌త్య‌కేసులోనే ఇంద్రాణి, సంజీవ్ ఖ‌న్నాలు జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో షీనాబోరా కేసులో మ‌రో కొత్త కోణం వెలుగుచూసింది. షీనాబోరాను ఇంద్రాణి, ఆమె మాజీ భ‌ర్త సంజీవ్ ఖ‌న్నాతో క‌లిసి హ‌త్య చేసింద‌ని ప్ర‌ధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి కారు డ్రైవ‌ర్ శ్యామ్‌వ‌ర్ రాయ్ నిజాన్ని అంగీకరించాడు. షీనా మృత‌దేహానికి ఇంద్రాణి లిప్ స్టిక్ రాసి, జుట్టు స‌రిచేసి, పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టిన‌ట్లు రాయ్ ముంబై కోర్టుకు వివ‌రించాడు. 
 
అంతేగాకుండా ఇంద్రాణి, సంజీవ్ ఖ‌న్నా, షీనాబోరా క‌లిసి కారులో బాంద్రా నుంచి బ‌య‌లుదేరిన‌ట్లు, ఆ త‌ర్వాత ఇంద్రాణి చెప్పిన ప్ర‌కారం తాను, సంజ‌య్‌లు షీనాను గ‌ట్టిగా ప‌ట్టుకోగా ఆమె గొంతు నులిమి చంపేసింద‌ని డ్రైవర్ అంగీకరించాడు. ఆ త‌ర్వాత పాలి హిల్ వ‌ద్ద మృత‌దేహాన్ని పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టిన‌ట్లు తెలిపాడు. ఈ విషయాలు బయటకి చెప్పొద్దని.. చెప్తే ప్రమాదమని ఇంద్రాణి తనను బెదిరించినట్లు డ్రైవర్ అంగీకరించాడు. దీంతో ఇంద్రాణికి కఠిన శిక్ష తప్పదని పోలీసు వర్గాల సమాచారం.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments