మెమోరియల్ హౌస్‌గా మారనున్న జయలలిత నివాసం (video)

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (09:47 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం స్మారక మందిరంగా మారనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దీంతో చెన్నై, తేనాంపేట, పోయస్ గార్డెన్‌లో ఉన్న జయలలిత నివాసమైన వేదా నిలయం మెమోరియల్ హౌస్‌గా మారనుంది. 
 
జయలలిత అనారోగ్య కారణంగా గత 2016 డిసెంబరు ఐదో తేదీన చనిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమెకు చెందిన ఆస్తులపై ఆమె ప్రియ నెచ్చెలి శశికళతోపాటు.. జయలలిత అన్న కుమార్తె దీపా పోటాపోటీగా హక్కులు ప్రకటించారు. జయలలిత ఆస్తులకు తామే వాసులమంటూ ప్రకటనలు ఇచ్చారు. 
 
దీంతో రాష్ట్ర ప్రభుత్వం జయలలిత పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ కోర్టు ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుంది. అదేసమయంలో జయలలిత అధికారిక నివాసమైన పోయస్ గార్డెన్‌ను మాత్రం స్మారక నిలయంగా ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ చర్యల్లో భాగంగా, ఇపుడు వేదా నిలయాన్ని మెమోరియల్ హౌస్‌గా మార్చేందుకు వీలుకల్పించే ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments