Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ సదాశివం!

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (14:41 IST)
కేరళ రాష్ట్ర గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయన పేరును సిఫార్సు చేసింది. ఇక రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. 
 
ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత షీలా దీక్షిత్ ఇటీవలే తన  పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె స్థానంలో సదాశివంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేశారు. 
 
ఇదే జరిగితే న్యాయ వ్యవస్థలో కీలక పదవులు అలంకరించిన ప్రముఖులు కూడా గవర్నర్ గిరీ చేపట్టేందుకు సదాశివం బాటలు వేసినట్టేనన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. యూపీఏ హయాంలో తొమ్మిది నెలల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సదాశివం, 2జీ, కోల్ గేట్ తదితర కేసులపై వేగంగా దర్యాప్తు జరిగేలా చర్యలు చేపట్టారు. అంతేకాక పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సదాశివం సంచలన తీర్పులు వెలువరించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

Show comments