పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

ఠాగూర్
మంగళవారం, 18 నవంబరు 2025 (13:08 IST)
పెళ్ళికి ముందు పరస్పర ఆమోదంతో ఆనందం కోసం శారీరక సంబంధం పెట్టుకోవడం ఇపుడు సర్వసాధారణమైపోయిందని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత యువకుడిపై కేసు పెడుతున్నారని మండిపడింది. తొమ్మిదేళ్ళు లైంగిక సంబంధంలో ఉన్నాక తనతో వివాహానికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై యువతి చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో ఈ మేరకు పేర్కొంది. 
 
తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్‌ అనే యువకుడిపై ఓ యువతి వళ్లియూర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఇద్దరం కళాశాలలో ప్రేమించుకున్నామని, వివాహం చేసుకుంటామని విజయ్ తొమ్మిదేళ్ళు తనతో లైంగిక సంబధంలో ఉండి తర్వాత పెళ్లికి నిరాకరించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ విజయ్ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుగళేంది... సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. 
 
పిటిషన్‌తో సుధీర్ఘకాలం లైంగిక సంబధం కొనసాగించినప్పటికీ ఫిర్యాదుదారు వ్యతిరేక తెలుపకపోవడం, వారిద్దరి సమ్మతితోనే అది జరిగిందని సూచిస్తోంది. పెళ్ళి చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇద్దరూ బంధాన్ని ఏర్పరచుకుని, సుధీర్ఘకాలం పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో వారిమధ్య సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు.
 
ఇద్దరి మధ్య సంబంధం ప్రేమ ఆధారంగా ఏర్పడిందా వివాహం కోసం ఎదురు చూశారా, కేవలం పరస్పర ఆనందమూ అనేది వారికి మాత్రమే తెలుసు. ఇలాంటి విషయాల్లో కోర్టు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యం అని న్యాయమూర్తి పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే, యువకుడిపై నమోదైన కేసును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం