Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులపై అఘాయిత్యాలు.. ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు..

చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉత్తర భారతంలో చిన్నారులు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రత

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (10:13 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉత్తర భారతంలో చిన్నారులు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. సెకనుకో చిన్నారి వేధింపుల బారిన పడుతోందని ప్లాన్ ఇండియా అనే ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 
 
'క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారులు'పేరిట ఎన్జీవో ఒక నివేదికను వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు నెలలపాటు 2 వేల సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి 1500 మంది సర్వే నిర్వహించారు. మొత్తం మానవ అక్రమ రవాణా నేరాల్లో అండమాన్‌, నికోబార్‌ దీవులు, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లో 61 శాతం నేరాలు నమోదవుతున్నాయి. 
 
ఈ రాష్ట్రాల్లో అదృశ్యమైన చిన్నారుల్లో 48 శాతం మంది ఆచూకీ లభించడంలేదు. రాజస్థాన్‌లో బాల్య వివాహాలు తీవ్రంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 54.9, హర్యానాలో 28 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం