Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ ఫైన్ వేశాడనీ... ఠాణాకు కరెంట్ కట్ చేసిన లైన్‌మేన్

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (20:51 IST)
ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించక పోవడంతో ఓ కరెంట్ లైన్‌మేన్‌కు ట్రాఫిక్ ఎస్.ఐ రూ.500 అపరాధం విధించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ లైన్‌మ్యాన్‌.... కరెంట్ బిల్లు కట్టడం లేదన్న సాకుతో ఠాణాకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రతిచర్య తీసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రాలోని లీనాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక విద్యుత్ బోర్డులో లైన్‌మేన్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఈయన డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీన్ని గమనించిన లీనాపూర్ ఎస్.ఐ. రమేష్ చంద్ర రూ.500 అపరాధం విధిస్తూ చలానా రాశాడు. ఆ తర్వాత హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ గురించి శ్రీనివాస్‌కు ఎస్.ఐ వివరించాడు. 
 
ఈ చర్యతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ విద్యుత్ సబ్ స్టేషన్‌కు వెళ్లి పోలీస్ స్టేషన్‌కు కరెంట్ సరఫరా చేసే లైన్‌ను కత్తిరించాడు. ఈ విషయం తెలియని పోలీసులు.. విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్ చేయగా... పోలీస్ స్టేషన్‌కు సంబంధించి రూ.6.6 లక్షల కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉందనీ అందుకే కరెంట్ కట్ చేసినట్టు వివరణ ఇచ్చాడు. పైగా, మొత్తం బిల్లు చెల్లిస్తేనే కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని భీష్మించికూర్చున్నాడు. దీంతో మొత్తం విద్యుత్ బిల్లును చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments