Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ బోయ్స్ అడ్రెస్ గల్లంతు... బుద్ధి వచ్చిందా? నేతాజీకి పార్టీ పగ్గాలివ్వు... అఖిలేష్ రాజీనామా

సమాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తండ్రి నుంచి పార్టీని లాగేసుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్‌ను ప్రజలు తిరస్కరించారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాజపాకు ఏకంగా 313 స్థానాలను

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (12:09 IST)
సమాజ్ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తండ్రి నుంచి పార్టీని లాగేసుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్‌ను ప్రజలు తిరస్కరించారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాజపాకు ఏకంగా 313 స్థానాలను కట్టబెట్టే దిశగా యూపీ ప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల ఫలితాల సరళి చూపిస్తోంది. దీనికి అఖిలేష్ యాదవ్ స్వయంకృతాపరాధమే అని తెలుస్తుంది. 
 
తన తండ్రి చెప్పిన మాటను పెడచెవిన పెట్టడమే కాకుండా ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా అంతా నేరమయ చరిత్ర ఉన్నవారు కావడంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినట్లు అర్థమవుతుంది. అఖిలేష్ చర్యల కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతున్నామంటూ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. వెంటనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ కు కట్టబెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ మధ్యాహ్నం అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు.
 
ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ- అఖిలేష్ యాదవ్ ఇద్దరూ తాము లోకల్ బోయ్స్, నేషనల్ లీడర్ మనకెందుకు అంటూ ప్రచారం చేసారు. ఐతే లోకల్ బోయ్స్ ను జనం తిప్పికొట్టారు. డింపుల్ యాదవ్ పాటలను ప్రజలు ఎంజాయ్ చేశారు కానీ ఓట్లు మాత్రం వేయలేదు. మొత్తమ్మీద అఖిలేష్ యాదవ్ కు యూపీ ప్రజలు కోలుకోలేని షాకిచ్చి కూర్చోబెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments