Webdunia - Bharat's app for daily news and videos

Install App

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

ఠాగూర్
గురువారం, 26 జూన్ 2025 (19:30 IST)
రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై భారత ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించనుంది. 2019 నుంచి ఇప్పటివరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డిలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించి నిర్ణయం తీసుకుంది. 
 
ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం వద్ద సుమారు 2800కి పైగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. సాధారణంగా ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలి. మిగిలిన పార్టీలను నమోదిత గుర్తింపు లేని పార్టీలుగా పరిగణిస్తారు. 
 
వాచ్‌మెన్ దెబ్బలు భరించలేక 17వ అంతస్తు నుంచి దూకేసిన శునకం.. 
 
ముంబై మహానగరంలో ఓ అమానుష ఘటన జరిగింది. వాచ్‌మెన్ దెబ్బలు భరించలేక ఓ శునకం 17వ అంతస్తు నుంచి దూకేసింది. దీంతో ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియను చూసిన జంతు ప్రేమికులు ఆ వాచ్‌మెన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కర్రతో కుక్కను దారుణంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దెబ్బలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన శునకం చివరకు 17వ అంతస్తున్న బాల్కనీ పైనుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ వీడియోను జంతు హక్కుల కార్యకర్త విజయ్ రంగారే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ భవన వాచ్‌మెన్ ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కానీ అది సరిపోదని నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
అలాగే, నెటిజన్లు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దయచేసి కఠిన చర్యలు తీసుకోండి. ఆ మూగజీవి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించింది, కానీ, దానివల్ల కాక భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది అని ఒక యూజర్ కామెంట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments