Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిన మణిపూర్ - హిమాచల్ ప్రదేశ్ - రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (08:40 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ భూప్రకంపనలతో వణికిపోయింది. ఈ రాష్ట్రంలోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. ఉదయం 6.గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. 
 
మొయిరాంగ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఉదయం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకుగురై తమ తమ నివాసాల నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు. 
 
అయితే, ఈ భూప్రకపంనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఎన్‌సీఎస్‌ పేర్కొంది. అలాగే గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. 
 
ఉదయం 6.25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత 7.13గంటలకు మరోసారి రిక్టర్‌ స్కేల్‌పై 2.4 తీవ్రత ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments