దుర్గాపూర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం : బాధితురాలి స్నేహితుడు అరెస్టు

ఠాగూర్
బుధవారం, 15 అక్టోబరు 2025 (10:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, తాజాగా బాధితురాలి స్నేహితుడుని కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వాంగ్మూలానికి, ఆమె స్నేహితుడు చెబుతున్న విషయాలకు పొంతన లేకపోవడంతో మంగళవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ కేసులో సామూహిక అత్యాచారం జరగలేదని, బాధితురాలి సహరుడు అయిన స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు అసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌద్రీ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 
 
'ఇప్పటివరకు లభించిన ఆధారాలు, వాంగ్మూలాలను బట్టి ఇది గ్యాంగ్ రేప్‌‍గా కనిపించడం లేదు. కేవలం ఒకే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది' అని ఆయన తెలిపారు. నిందితుల దుస్తులు, ఘటనా స్థలంలోని ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించామని, పూర్తి నివేదిక వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
 
కేసు విచారణలో భాగంగా డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తా నేతృత్వంలోని బృందం ఇప్పటికే అరెస్టయిన ఐదుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసింది. అయితే, వారు చెప్పిన విషయాల్లో కూడా పొంతన కుదరలేదు. మరోవైపు, బాధితురాలు కూడా మొదట ఒకరే అత్యాచారం చేశారని, ఆ తర్వాత ఐదుగురూ చేశారని వాంగ్మూలం మార్చడం గందరగోళానికి దారితీసింది.
 
ఈ కేసులో హాస్టల్ గేటు వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్ అత్యంత కీలకంగా మారింది. ఐదుగురు నిందితులు తనను లాక్కెళ్లినప్పుడు స్నేహితుడు భయంతో పారిపోయాడని బాధితురాలు చెప్పింది. కానీ, ఘటన తర్వాత బాధితురాలు, ఆమె స్నేహితుడు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా హాస్టల్‌కు నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆమె దుస్తులు నలగడం కానీ, జుట్టు చెరగడం కానీ ఆ వీడియోలో కనిపించలేదు. హాస్టల్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది సహాయం కోరినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు.
 
ఘటన జరిగిన రోజు తన కుమార్తె స్నేహితుడు గంటన్నర ఆలస్యంగా తమకు సమాచారం ఇచ్చాడని, అతడిపై తమకు అనుమానం ఉందని బాధితురాలి తండ్రి 10వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా, ఘటన తర్వాత బాధితురాలి ఫోన్ నుంచి ఆమె స్నేహితుడికి ఫోన్ చేసిన ఆగంతుకులు, ఫోన్ తిరిగి ఇవ్వాలంటే రూ.3,000 డిమాండ్ చేశారని, ఆమె దగ్గరున్న రూ.200 లాక్కున్నారని కమిషనర్ తెలిపారు. ఈ కొత్త పరిణామాలతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం