Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సిటీ బస్సులో పోలీస్ కానిస్టేబుల్ వీరంగం... ప్రయాణికులంతా కలిసి...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (15:59 IST)
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చెన్నై ఒకటి. ఈ నగరంలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఎంటీసీ) సిటీ బస్సులను నడుపుతుంది. అయితే, ఈ బస్సుల్లో అపుడపుడూ కొన్ని అసాంఘిక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ పీకల వరకు మద్యం సేవించి బస్సెక్కి.. కండక్టర్, ప్రయాణికుల పట్ల దురుసుకా ప్రవర్తించాడు. చేయిచేసుకున్నాడు. దీంతో ప్రయాణికులంతా కలిసి కిందిలాగి పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై కోయంబేడు - వండలూరు ప్రాంతాల మధ్య 70వి అనే నంబరు సిటీ బస్సు నడుస్తుంది. అయితే, ఓ పోలీస్ కానిస్టేబుల్ తప్పతాగి బస్సెక్కాడు. ఆ తర్వాత తోటి ప్రయాణికులతో పాటు.. కండక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనను ప్రశ్నించిన ప్రయాణికులపై చేయి చేసుకున్నాడు. 
 
సీట్లో కూర్చొమంటే కూర్చోలేదు. కుదురుగా నిలబడమంటే నిలబడకుండా బస్సులో నానా రభస చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణికులకు.. బస్సును ఆపి.. తప్పతాగని కానిస్టేబుల్‌ను కిందకులాగి పడేశాడు. ఈ తంతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments