Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూటుగా మద్యంసేవించి మహిళ బ్యాగుపై మూత్రం పోసిన కొవ్వెక్కిన వ్యాపారి

ఒళ్లు బలిసిన ఓ వ్యాపారి ఒకరు.. పూటుగా మద్యం సేవించి.. ఓ మహిళా బ్యాగుపై మూత్రం పోశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ తాగుబోతును పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (14:53 IST)
ఒళ్లు బలిసిన ఓ వ్యాపారి ఒకరు.. పూటుగా మద్యం సేవించి.. ఓ మహిళా బ్యాగుపై మూత్రం పోశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ తాగుబోతును పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఒడిషాకు చెందిన ప్రభాకర్ దొర అనే ఓ వ్యాపారి కోల్‌కతా నుంచి చెన్నై వెళ్లేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ అతడు మోతాదుకు మించి తాగేయడంతో.. అతడిని విమానం నుంచి దింపేశారు. అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకొచ్చి, తర్వాత మరో విమానం వచ్చేవరకు ఆగాలని చెప్పారు. అప్పటిలోగా అతడి పరిస్థితి అదుపులోకి వస్తుందని ఇండిగో సిబ్బంది భావించారు. 
 
ఈ పరిస్థితుల్లో రాత్రి 11 గంటలకు చెన్నై వెళ్లడానికి ఆఖరి విమానం ఉంది. దాంతో మిగిలిన ప్రయాణికులతో పాటు దొర కూడా బోర్డింగ్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే అతడి మత్తు అప్పటికి ఇంకా దిగలేదు. దాంతో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఓ మహిళ బ్యాగ్‌పై మూత్రవిసర్జన చేశాడు. 
 
ఈ చర్యకు తీవ్రంగా ఆగ్రహించిన సదరు మహిళ ఎయిర్‌పోర్టు మేనేజర్ గదిలోకి వెళ్లి, ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... దొరను అదుపులోకి తీసుకుని రాత్రంతా జైల్లో పెట్టారు. మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments