Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూఢ నమ్మకానికి యువతి బలి - టైఫాయిడ్ జ్వరం వస్తే చర్నాకోలుతో కొట్టడంతో

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (09:33 IST)
హైటెక్ సమాజంలో ఇంకా మూఢ నమ్మకాలు ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో మూఢ భక్తిభావం పేరుతో తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనమైంది. ఇపుడు తమిళనాడు రాష్ట్రంలో ఓ కన్నతండ్రి మూఢ నమ్మకం కన్నబిడ్డ ప్రాణాలు తీసింది. పైగా, కుమార్తె ఆత్మ తన భార్యకు ఆవహించిందంటూ ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామనాథపురం జిల్లాకు చెందిన తరణి అనే యువతి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ వచ్చింది. అంతకుమనుపు ఆమె పలు మార్లు తన తల్లి సమాధి వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆనారోగ్యం పాలైంది. 
 
అయితే.. బాధితురాలి తండ్రికి దయ్యాలు, భూతాలు ఉన్నాయనే నమ్ముతాడని మూఢనమ్మకాలు ఎక్కువని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చనిపోయిన తన భార్య ఆత్మ కూతురిని ఆవహించిందని తండ్రి బలంగా నమ్మాడు. భూతాన్ని వదిలించేందుకు తరణిని ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. 
 
ఆ భూత వైద్యుడు తరుణికి చర్నాకోలుతో కొట్టి.. పొగపెట్టడంతో.. ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె తండ్రి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్టు వెల్లడైంది. తదనంతరం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆమెకు టైఫాయిడ్ సోకినట్టు వెల్లడైంది. అయితే.. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments