అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఈనెల 22న జరుగనుంది. రామమందిరం భద్రతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించనున్నారని తెలుస్తోంది. AIకి సంబంధించిన అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రదేశాలను సందర్శించే వ్యక్తులను నిశితంగా పరిశీలించవచ్చు.
పోలీసు డేటాబేస్‌లో నేరస్తుల సమాచారం నిక్షిప్తం చేయనున్నారు. రామాలయం ప్రారంభోత్సవం తర్వాత రానున్న రోజుల్లో అయోధ్యకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరగనుందని అంచనా వేస్తున్నారు.
దీంతో భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి AI ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయోధ్యలో అత్యాధునిక భద్రతా పరికరాల కోసం ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది.