Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి ఆక్సిజన్ ఇస్తారా? ఇవ్వరా? కేంద్రానికి సుప్రీం వార్నింగ్

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (14:44 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశం ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఆస్పత్రుల్లో ఉండే కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. దీనిపై కేంద్రాని సుప్రీంకోర్టు నిలదీస్తోంది. తాజాగా కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీకి ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని... పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని... ఈ సమస్యను ఎదుర్కోవడానికి తాము తదుపరి ఆదేశాలను ఇచ్చేంతవరకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
 
ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అనే విషయాన్ని తాము స్పష్టంగా చెపుతున్నామని... తాము కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని రానివ్వొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 
 
ప్రతి రాష్ట్రానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్‌పై నిపుణుల ప్యానెల్ ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంతో మంది జీవితాలను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments