Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది తెలుగు రాష్ట్రాల గొడవ... మమ్మల్ని లాగొద్దు... 'కృష్ణా'పై కర్ణాటక..!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా ఉమ్మడి ఏపీలోని కృష్ణా జలాల పంపకం కూడా రెండు రాష్ట్రాలకు సమానంగా జరగాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. అయినా అది తెలుగు రాష్ట్రాల గొడవ అని తమను లాగొద్దని తెలిపింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు కర్నాటక తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
 
బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహరాష్ట్ర్రలు తమ వాదనను వినింపించనున్నాయి. మొదట కర్ణాటక వాదనలు వినిపించింది. గురు శుక్రవారాల్లో మిగిలిన మూడు రాష్ట్రాలు తమ వాదననను వినిపించనున్నాయి. ఇందులో తిరిగి పంపకాలు జరపాలా? లేక ఏపి విడిపోయిన నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల నడుమ మాత్రమే వాటికి కేటాయించిన నీటిని పంచుకునేలా చేయాలా అనే అంశంపై చర్చ సాగుతోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
తాజా విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ బుధవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీ పంపకాల ప్రక్రియ విధివిధానాలు, పరిధి నిర్ధారణపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్ర జల వనరుల శాఖలు తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ అఫిడవిట్లు, కౌంటర్లు దాఖలు చేశాయి. తొలుత బుధవారం కర్ణాటక తన వాదనలు వినిపించింది.
 
  గురు, శుక్రవారాల్లో మిగతా రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత ట్రిబ్యునల్ తన పరిధిని, విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం 9 ముసాయిదా విధివిధానాలపై రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కేటాయింపులు కేవలం కొత్త రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల మధ్యే ఉండాలని కర్ణాటక వాదించింది. కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ వివాదంతో సంబంధం లేదని పేర్కొంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments