Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన శునకం.. ఎలా?

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (09:17 IST)
వెంట్రుకలున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతున్నది ఓ సామెత. అలాగే, డబ్బులున్న ధనవంతులు కొండమీది కోతినైనా కిందికి దించుతారు. అలాంటి సంఘటనే ఇపుడు ఒకటి జరిగింది. తన పెంపుడు శునకాన్ని తన వెంట తీసుకెళ్లేందుకు ఓ కోటీశ్వరుడు ఏకంగా బిజినెస్ క్లాస్‌లోని టిక్కెట్లన్నీ బుక్ చేసుకున్నాడు  ఇందుకోసం ఏకంగా రూ.2.50 లక్షలను ఖర్చు చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ ప్రయాణికుడు చెన్నైకి తన పెంపుడు శునకంతో వచ్చేందుకు ప్లాన్ చేశాడు. అయితే, ఈ శునకం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, పైగా, శునకానికి సౌకర్యంగా ఉండేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-671  బిజినెస్ క్లాస్ కేబిన్‌లోని 12 సీట్లను రూ.2.50 లక్షలు వెచ్చించి బుక్ చేసుకున్నాడు. బుధవారం ఈ విమానంలో ముంబై నుంచి చెన్నైకి చేరుకుంది. 
 
అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో శునకాలతో గతంలోనూ పలువురు ప్రయాణించారు. అయితే, దాని కోసం బిజినెస్ క్లాస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. 
 
అంతేకాదు, పెంపుడు జంతువులతో కలిసి ప్రయాణించేందుకు అనుమతించే విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే. ఒక విమానంలో గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా చివరి వరుసలో ప్రయాణానికి మాత్రమే అనుమతి ఉంది. గతేడాది జూన్-సెప్టెంబరు మధ్య ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో 2,000 పెంపుడు జంతువులు ప్రయాణించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments