Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికులకు సర్కారు దీపావళి గిఫ్ట్.. నిమిషానికి ఒక్క రూపాయి..

కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు దీపావళి కానుకను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమకు దూరంగా ఉంటున్న ఆత్మీయులతో అధిక సమయం పాటు మాట్లాడుకోవడానికి వీలుగా కాల్ ఛార్జీలన

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (08:27 IST)
కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు దీపావళి కానుకను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమకు దూరంగా ఉంటున్న ఆత్మీయులతో అధిక సమయం పాటు మాట్లాడుకోవడానికి వీలుగా కాల్ ఛార్జీలను తగ్గించింది. ఈ విషయంపై కేంద్ర టెలీకాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ, డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్ ద్వారా మాట్లాడానికి ఇప్పటివరకూ సైనికులు నెలకు రూ.500 చెల్లించేవారనీ, దీనికి అదనంగా నిమిషానికి రూ.5 చొప్పున కాల్ ఛార్జీలు చెల్లిస్తూ వచ్చారన్నారు. 
 
అయితే, దేశయావత్తూ దీపావళి సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో సైనికులకు కూడా ప్రభుత్వం ఓ కానుక ఇచ్చిందన్నారు. ఈ పండుగ కానుకగా ప్రభుత్వం కాల్ ఛార్జీలను నిమిషానికి రూ.5 నుంచి రూ.1కి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 
 
ఇది గురువారం (అక్టోబర్ 19) నుంచే అమల్లోకి వస్తుందన్నారు. అలాగే, డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్ కోసం వసూలు చేస్తున్న రూ.500 ఛార్జీని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి నిమిషానికి ఒక్క రూపాయకే దూరంగా ఉన్న ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చని మంత్రి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments