భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:39 IST)
భార్యాభర్తల అనుబంధం రాను రాను కనుమరుగవుతోంది. వివాహేతర సంబంధాలు లేకుంటే మనస్పర్థలు సంసారాలను కూలదోస్తున్నాయి. తాజాగా తమిళనాడు, కడలూరులో భర్తతో గొడవకు దిగిన ఓ ఇల్లాలు తన బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కడలూరుకు చెందిన మదివానన్ (40).. ఫార్మసీ నడుపుతున్నాడు. 
 
ఇతని భార్య శివశంకరి (35). వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. రెండేళ్ల క్రితం నుంచే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. దీంతో మనస్తాపానికి గురైన శివ శంకరి.. తన కుమారులతో పాటు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

భార్యతో గొడవపడి ఫార్మసీకి వెళ్ళి.. రాత్రి ఇంటికొచ్చిన మదివానన్‌కు షాక్ తప్పలేదు. తన ఇంట్లోని ఫ్యానుకు శివశంకరితో పాటు కుమారులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చూసి షాక్ అయ్యాడు. 
 
కుమారులిద్దరికీ విషం ఇచ్చిన శివశంకరి.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ శంకరి రాసిన సూసైడ్ నోట్‌ను కనిపెట్టారు. అందులో తన భర్తను తాను ఇబ్బందులకు గురిచేశానని.. ఆయనకు ఇక్కట్లు కలగనీయకుండా వెళ్ళిపోతున్నానని రాసివుంది.

తన కుమారులు ఆయనకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే.. వారిని కూడా తన వెంట తీసుకెళ్తున్నానని శివశంకరి రాసినట్లు వుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments