Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫడ్నవీస్ తొందరే ముంచింది...... ఎక్కడ.. ఎందుకు?

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (16:59 IST)
అధికారంలోకి రావాలన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తొందరపాటు, చిన్నపిల్లల చేష్టల్లాంటి కామెంట్స్ వల్లే మహారాష్ట్రలో బీజేపీ నిండా మునిగిపోయిందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ చీఫ్​ సోనియాగాంధీ కూటమిని మహారాష్ట్రతో పాటు దేశ ప్రజలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కూటమి సర్కారు ఐదేళ్లు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 
 
శివసేన పార్టీకి చెందిన ‘సామ్నా’లో ‘రోఖ్ ఠోక్’ పేరుతో రాసిన సంపాదకీయంలో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పట్టును ఎదుర్కొని సర్కారును ఏర్పాటు చేశామన్నారు. శరద్ పవార్ ప్లాన్​లో భాగంగానే ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ మద్దతిచ్చారని మాట్లాడిన వారంతా ఇప్పుడు ఆయన ఎదుట తలదించుకుంటున్నారని చెప్పారు. 
 
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫడ్నవీస్ చిన్నపిల్లల తరహాలో ఆరోపణలు చేశారన్నారు. శరద్ పవార్ శకం ముగిసిందని, మహారాష్ట్రలో అపొజిషన్ పార్టీలే లేవని వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే అపొజిషన్ లీడర్​గా మిగిలిపోయారని రౌత్ ఎద్దేవా చేశారు. ఓవర్​కాన్ఫిడెన్స్, ఢిల్లీలోని సీనియర్​ నాయకుల తప్పుడు గైడెన్స్ వల్ల ఫడ్నవీస్ పొలిటికల్ కెరీర్ నాశనమైందన్నారు.
 
నెగెటివ్ థాట్స్ కొంప ముంచాయి: అశోక్ గెహ్లాట్
నెగెటివ్ థాట్స్ వల్ల మహారాష్ట్రలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆదివారం జైపూరులో అన్నారు. వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటాయి. అందుకే ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యారు. వాళ్ల గ్రాఫ్ పడిపోతోందని గెహ్లాట్​ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి హేమ ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నారా..? కోర్టు కామెంట్స్ ఏంటి?

దివ్వెల మాధురి డ్యాన్స్ వీడియో.. ట్రోల్స్ మొదలు.. (video)

జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదే.. జానీ మాస్టర్ దంపతులు (video)

Little chitti Babu: ఎంత సక్కగున్నావె పాటకు బుడ్డోడి సాంగ్ (video)

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments