Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిమినల్స్‌కు పార్టీలో చోటెందుకు కల్పించారు : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (11:58 IST)
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు తేరుకోనిషాకిచ్చింది. తమతమ పార్టీల్లో నేర చరిత్ర కలిగిన రాజకీయ నేతల వివరాలను 48 గంటల్లో పార్టీల వెబ్‌సైట్లలో ఉంచాలని ఆదేశించింది. అలాగే, ఇలాంటి క్రిమినల్స్‌కు పార్టీలో ఎందుకు చోటుకల్పించారని కోర్టు సూటిగా ప్రశ్నించింది. 
 
రాజ‌కీయ‌ల్లో క్రిమిన‌ల్స్ పెరుగుతున్నార‌ని కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. ఎటువంటి నేత‌ల‌పై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు  పార్టీలో చేర్చుకున్నారో అన్న అంశాల‌ను త‌మ త‌మ వెబ్‌సైట్ల‌లో పొందుప‌రుచాల‌ని కోర్టు త‌న తీర్పులో రాజ‌కీయ పార్టీల‌ను ఆదేశించింది. 
 
అలాగే, సోష‌ల్ మీడియా, స్థానిక ప‌త్రిక‌ల్లో కూడా నేర చరిత్ర క‌లిగి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌ గురించి రాజ‌కీయ పార్టీలు వెల్ల‌డించాల‌ని కోర్టు సూచించింది. రానున్న 72 గంట‌ల్లో ఆ వివ‌రాల‌ను ఎన్నిక‌ల సంఘానికి తెలియ‌జేయాల‌ని కూడా కోర్టు ఆదేశించింది.
 
అభ్య‌ర్థుల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా ఉండాల‌ని, కానీ గెలుపు శాతం ఆధారంగా కాద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఒక‌వేళ రాజ‌కీయ పార్టీలు నేర చ‌రిత్ర క‌లిగిన నేత‌ల వివ‌రాలు ఇవ్వ‌లేక‌పోయినా, లేక ఎన్నిక‌ల సంఘం త‌మ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌లేక‌పోయినా.. దాన్ని కోర్టు ధిక్క‌ర‌ణ‌గా భావిస్తామ‌ని సుప్రీం హెచ్చరించింది.  

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments