కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (13:07 IST)
కర్నాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లాలో అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కోడి వింతగా నీలి రంగు గుడ్డుపెట్టింది. సయ్యద్ నూర్ అనే రైతు పెంచుతున్న కోళ్లలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ గుడ్డును పరిశీలించిన పౌల్ట్రీ నిపుణులు... బైలివెర్డిన్ అనే పిగ్మెంట్ కారణంగానే ఈ రంగు గుడ్డు వచ్చిందని వెల్లడించారు. కాగా, ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. వాటిలో ఒక కోడి తాజాగా నీలం రంగు గుడ్డు పెట్టడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. సాధారణంగా తెలుపు రంగులో ఉండే కోడిగుడ్లను చూసిన స్థానికులు ఈ నీలం గుడ్డు ఓ అద్భుతంగా కనిపించింది. దీంతో ఈ విషయం ఊరంతా పాకి ఓ కోడిని, ఆ నీలి రంగు గుడ్డును చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. 
 
ఈ వింతైన గుడ్డు సమాచారం అందుకున్న చన్నగిరి తాలూకా పశుసంవర్ధఖ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుంది. వారు ఆ కోడిని, గుడ్డును క్షుణ్ణంగా పరిశీలీంచారు. కొన్ని జాతుల కోళ్ళలో ఉండే బైలివెర్డిన్ అనే వర్ణద్రవ్యం (పిగ్మెంట్) కారణంగా గుడ్డు పెంకుకు నీలి లేదా ఆకుపచ్చ రంగు వస్తుందని డాక్టర్ అశోక్ వివరించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని అయితే గుడ్డు రంగు మారినా దానిలోని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments